Pujas & Vrathams






🌻ఓం శ్రీసాయిరాం🌻 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌹🌹 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... 4/11/2024 కార్తీక మాసం సోమవారం నాడు ఉదయం 10-00 గంటల నుండి, వైరా వేద పాఠశాల లో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు వేద పండితులతో అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,ట్రస్ట్ సభ్యులు , వైరా సమితి కన్వీనర్, సమితి సభ్యులు యూత్ సభ్యులు పాల్గొన్నారు.. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వేద విద్యార్థులకు ప్రశంసా పత్రాలు బహూకరణ జరిగింది.. మరియు సెప్టెంబర్ 2024 లో పాఠశాల స్థాయి లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో వైరా సమితి స్థాయి విజేతలకు సర్టిఫికెట్లు బహూకరించడం జరిగింది.. సాయిరాం🙏 జిల్లా అఫిస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా