Bhajans






ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా , ఖమ్మం సమితి ఖమ్మం పట్టణము లో నిర్వహించబడే నిత్య భజన మరియు 99 రోజుల దీక్షా సాధనలో భాగముగా నేడు (91)వ రోజు అనగా 30/10/24 వ తేదీ బుధవారం సాయంత్రం 6-30 గంటలకు మామిళ్ళ గూడెం లోని జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ వూటుకూరి జగన్మోహన్ రావు గారు శ్రీమతి ఉషారాణి గారి ఇంటి వద్ద భజన కార్యక్రమం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమములో నామ సంకీర్తన తో పాటు సేవా కార్యక్రమములో భాగముగా ఇటీవల వరదల సమయంలో 49 వ డివిజన్లో ఉత్తమ సేవలు అందించిన, 13 మంది మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు అభినందన పూర్వకంగా, వస్త్ర వితరణ సేవ మరియు ఒక నిరుపేద గృహిణి కీ ఉపాధి నిమిత్తము కుట్టుమిషన్ పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా 49 వ డివిజన్ కార్పొరేటర్ గారు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అద్యక్షులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రేమ సేవ సమ్మిళిత ఆదర్శ భజన గా పేర్కొంటూ అభినందించారు.. తదుపరి స్వామి వారికి మంగళ హారతి సమర్పించుటతో నేటి కార్యక్రమము ముగిసినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా