Special Programs


🙏🏾ఓం శ్రీ సాయిరాం🙏🏾 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించుకునే"100 గ్రామాలలో100 పల్లకీ సేవల "మహాయజ్ఞంలో భాగంగ "ఖమ్మం సమితిలోని యువజన విభాగం "వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే 79వ పల్లకీ సేవ మహాయజ్ఞం ఈ నెల (26-10-2024)వ తేది శనివారం సాయంత్రం 6:30 ని.లకు కూసుమంచి మండలం గై గొళ్ళపల్లి గ్రామములో అంగ రంగ వైభవంగా నిర్వహించబడింది.స్వామి వారు తమ ఇంటిముందుకు వచ్చినప్పుడు ఇంటివారందరు నీరు వారగా పోసి స్వామి వారికి మంగళ నీరాంజనంలు సమర్పించి స్వామి వారి ఆశీస్సులు పొందినారు. ఈ సేవా కార్యక్రమములో జిల్లా బాధ్యులు, యూత్ సభ్యులు,భక్తులు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినారు. ఈకార్యక్రమములో ఆ గ్రామములోని అయ్యప్ప స్వామి భక్తులు స్వామి వారి ఊరేగింపులో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా