Special Programs






🙏ఓం శ్రీ సాయిరాం🙏 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌺🌺 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... ఖమ్మం జిల్లా, మధిర సమితి, మీనవోలు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం... ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో 25/10/2024 శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరం జరిగింది, ఈ శిబిరంలో 34 పశువులకు గర్భధారణ, 25 పశువులకు నత్తలమందు, 11 పశువులకు జనరల్ వైద్యం చేయటం జరిగింది అలాగే 750 గొర్రెలకు క్యాల్షియం త్రాగించడం జరిగింది, అనంతరం తక్కెళ్ళపాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం గోశాలలో గోవులను పరీక్షించి మందులు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో తక్కెళ్ళపాడు పశు వైద్యులు డాక్టర్ కృష్ణారెడ్డి గారు, సిరిపురం పశువైద్యురాలు డాక్టర్ శ్రీమతి N ఉమాకుమారి గారు , మండల పశువైద్య సిబ్బంది , గోపాలమిత్ర సిబ్బందితోపాటు శ్రీ సత్యసాయి సేవాసంస్థల జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ K భాస్కరరావు గారు , శ్రీ వంగవీటి కృష్ణమూర్తి గారు, కోనా లక్ష్మి మోహనరావు గారు, రైతు సేవా కోఆర్డినేటర్ శ్రీ కుడుముల వెంకట్రామిరెడ్డి గారు , కుర్ర కోటేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా