Special Programs




🙏ఓం శ్రీ సాయిరాం 🙏 🔸ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న ,తల్లితండ్రులు లేక తాత గారి సంరక్షణలో వున్న శ్రీ హర్షిత అను ఒక నిరుపేద విద్యార్థినికి వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో సీట్ వచ్చిన, ఆర్థిక ఇబ్బందుల వలన చదువుకు ఇబ్బంది అవుతున్నదని తెలిసి ఆ విద్యార్థినికి స్వామి వారి ఆశీస్సులతో ఖమ్మం శ్రీ సత్యసాయి సేవా సంస్థ తరఫున 25,000 రూపాయల విలువ చేసే ఆమె చదువుకు అవసరమైన మెటీరియల్ మరియు కొంత నగదు మొత్తం ఈరోజు వారి గ్రామమునకు వెళ్లి ఆ విద్యార్థినికి అందచేయుట జరిగినది. ఈ మహత్తర సేవా కార్యక్రమములో ఖమ్మం సమితి కన్వీనర్ శ్రీ A. నరసింహారావు, యూత్ సభ్యుడు జె.సతీష్ కుమార్, సమితి సభ్యులు శ్రీ ఆర్.నాగరాజు (EHV instructor) మరియు శ్రీ వి. సైదులు పాల్గొన్నారు.ఇటువంటి తోడ్పాటు నందించే సేవా కార్యక్రమములో పాల్గొనే అవకాశము కలిగించిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ,ఇలాగే ఆ చిరంజీవి యొక్క చదువుకు ఎలాంటి విఘ్నం లేకుండా చదువు పూర్తి చేయించమని స్వామి వారిని ప్రార్థిస్తున్నాము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం.