Special Programs



🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మంజిల్లా. 🌻🌻 ఖమ్మం నగర వరద బాధితులకు సేవా కార్యక్రమాలు కొనసాగింపుగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో ఖమ్మం సమితి పరిధిలోని లోతట్టు ప్రాంతాల లో నివాసముంటున్న వరద బాధిత నారాయణులకు 29-09-24 వ తేదీ ఆదివారం నాడు 55 కుటుంబములకు అమృత కలశములు అందచేసే సేవాకార్యక్రమము ఆరోగ్య హాస్పిటల్ బ్యాక్ సైడ్ లైన్ లో వున్న స్నేహ సాయి అపార్ట్మెంట్ ఆవరణ వద్ద జరిగింది.. ఈ సేవా కార్యక్రమములో జిల్లా అద్యక్షులు, ఖమ్మం సమితి కన్వీనర్ గారు, ఖమ్మం సమితి బాధ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నేలకొండపల్లి సమితి శ్రీ వంగవీటి క్రిష్ణ మూర్తి గారు దంపతులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, యాక్టివ్ సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా.