Special Programs






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 ఖమ్మం లోతట్టు ప్రాంతాల వరద బాధితులకు సేవా కార్యక్రమాలు కొనసాగింపుగా 15/9/2024 ఆదివారం నాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణం లోని బొక్కలగడ్డ , వేంకటేశ్వర నగర్, పద్మావతి నగర్ ఎరియాలలోని 1500 బాధిత కుటుంబాలకు గాను ఈ రోజు 800 కుటుంబాలకు అమృత కలశాలు (18 రకాల నిత్యావసర వస్తువుల తో కూడిన కిట్స్... ఒక్కొక్క కిట్ విలువ Rs 1500/-). మరియు ఒక్కో కుటుంబానికి ఒక చీర, ఒక బ్లాంకెట్ ఒక గిఫ్ట్ బాక్స్ మరియు అన్న ప్రసాదము ప్రేమతో పంపిణీ చేయబడినవి. ఈ కార్యక్రమంలో ... శ్రీ P వెంకటరావు గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు తెలంగాణ రాష్ట్రము శ్రీ A వాసుదేవ రావు గారు రాష్ట్ర సర్వీస్ కోఆర్డినేటర్ శ్రీ R అనిల్ కుమార్ గారు రాష్ట్ర ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస్ గారు నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ D సుధాకర రావు గారు ఖమ్మం జిల్లా అద్యక్షులు ప్రేమతో పాల్గొన్నారు. శ్రీ P వెంకట రావు గారు రాష్ట్ర అద్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరమైన సమయములో అత్యవసరమైన సేవలు ఆహారము, నీరు అందించిన ఖమ్మం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవానిరతిని కొనియాడారు.. బురదతో నిండిన దేవాలయము, పాఠశాల మరియు ఇళ్లు శుభ్రము చేయుట శ్లాఘనీయమన్నారు.. సేవలో పాల్గొన్న అందరినీ అభినందించారు.. తమ సహకారం ఎల్లప్పుడూ వుంటుందని తెలిపారు.. కాలని పెద్దలు మాట్లాడుతూ, బురదతో నిండిన దేవాలయము మరియు ఇళ్ళు, తక్షణమే స్పందించి, తమ ఇబ్బందులను లెక్క చేయకుండా శుభ్రము చేసి, ఎంతగానో సహకరించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవలు మరువలేనివి అని ఎంతో ఆదర్శమని పేర్కొన్నారు.. రాష్ట్ర సమన్వయ కర్తలు కూడా స్వామి కృపతో జరుగుతున్న సేవలను అభినందించారు.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు, BHEL సమితుల వారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమితి వారు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అద్యక్షులు, కరీంనగర్ జిల్లా అద్యక్షులు, నల్గొండ జిల్లా అద్యక్షులు ఇట్టి సేవలో పాలుపంచుకుని స్వామి కృపకు పాత్రులు అయినారు.. శ్రీ దమ్మాలపాటి సుధాకర రావు గారు జిల్లా అద్యక్షులు సేవలో పాల్గొన్న, పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కృత్ఞతలు తెలుపుతూ స్వామి ఆశీస్సులు కోరారు. ఇంకను ఈ సేవలో ఖమ్మం, సత్తుపల్లి , ఇతర సమితి కన్వీనర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కార్యవర్గ సభ్యులు, భజన మండలి కన్వీనర్లు, ఖమ్మం, నేలకొండపల్లి , జక్కేపల్లి సమీతుల యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, యాక్టివ్ సభ్యులు పాల్గొన్నారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా