Special Programs



భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ప్రేమ రథం 12 సెప్టెంబర్ 2024న మధిర మండలంలో మొదటి రోజు తొండలగోపరం గ్రామంలో జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ శ్రీ దొండపాటి వెంకటేశ్వరరావు గారు ప్రారంభించగా తొండలగోపవరం, తొర్ల పాడు, సాయిపురం గ్రామాలలో స్వామివారు వీధి వీధిలో భక్తులను ఆశీర్వదిస్తూ భక్తుల కోలాట భజన బృందం చే శోభాయ మానంగా విహరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు , మధిర సమితి కన్వీనర్, స్వామివారి భక్తులు, జిల్లా, సమితి, కార్య వర్గ సభ్యులు,, భజన మండలి, యూత్ సభ్యులు , మహిళా సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. సాయిరామ్🙏