Service





🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణం లోతట్టు ప్రాంతాలలో మున్నేరు వరద భీభత్సం ---- EHV (Educatiion in Human Values) మానవతావిలువల బోధన క్లాసులు ప్రారంభించుకున్న ZPSS జలగం నగర్, హైస్కూల్ శుభ్రపరచి బోధనలు ఆచరణలో పెట్టిన సేవా కార్యక్రమం 8/9/2024 🌻🌻 31/8/2024 నుండి ఎడతెరపి లేకుండా ఉధృతంగా కురిసిన వర్షాలతో ఖమ్మం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు నిరాశ్రయులయి చాలా ఇబ్బందులకు గురి అయ్యారు..ఎంతగానో నష్ట పోయారు .. ప్రభుత్వ పాఠశాలలు కూడా వరద ప్రభావం తో బురదతో నిండిపోయాయి.. దెబ్బతిన్నాయి.. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు స్వామి వారి కృపతో తమ వంతు సేవలు అందిస్తున్న విషయం విదితమే.... ఇటీవల మానవతా విలువల బోధనకు (Education in Human Values)శ్రీకారం చుట్టి క్లాసులు ప్రారంభించుకున్న ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ హై స్కూల్ బిల్డింగ్ కూడా వరదలో చిక్కుకుంది..మొదటి అంతస్తు పూర్తిగా నీటితో నిండి పోయి పైన వున్న స్టోర్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది.. ఇట్టి పరిస్థితులు గమనించి, మానవతా విలువల బోధనలు ఆచరణలో చూపిస్తూ శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు పాఠశాల ప్రారంభించేందుకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు వర్షం వున్నప్పటికీ 8/9/2024 ఉదయం రంగం లోకి దిగాయి.. నిస్వార్థ సేవా భావంతో బురదతో నిండిన పాఠశాల గదులన్ని నీటితో కడిగి శుభ్రపరిచారు.. తడిసిపోయిన బుక్స్ ఇతర వ్యర్థాలు తొలగించారు.. 200 బెంచీలు నీటితో శుభ్రం చేసి , తడితో పాడవకుండా తుడిచి క్లాస్ గదుల్లో అమర్చారు.. పాఠశాల తిరిగి ప్రారంభానికి అనువుగా తీర్చి దిద్దారు..ఈ కార్యక్రమంలో ఫైర్ సర్వీస్ వారు సహకారం అందించారు.. ఈ కార్యక్రమం లో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అద్యక్షులు, ఖమ్మం సమితి కన్వీనర్ గారు, జిల్లా, సమితి కార్యవర్గ సభ్యులు, జక్కేపల్లి సమితి యూత్ సభ్యులు , మహిళా సభ్యులు, ZPSS జలగం నగర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.. మానవతా విలువలు బోధనను ఆచరణాత్మకంగా చూపించిన సంస్థ సభ్యుల సేవలను పలువురు కొనియాడారు.. స్వామి వారికి కృతజ్ఞతలు. అందరికి సాయిరాం ..🙏 జిల్లా అద్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా