Service






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 31/8/2024 తేదినుండి నిరవధికంగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం పట్టణ మున్నేరు లోతట్టు ప్రాంతాలు ఇతర ప్రాంతాలు జలమయమయ్యాయి.. ప్రజలు ఎన్నో బాధలకు గురి అయ్యారు.. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కృపతో వరద బాధితులకు ఖమ్మం శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా కేంద్రము వద్ద ఆహారము తయారు చేసి, ఆహార పాకెట్స్ షెల్టర్స్ లో వున్నవారికి ప్రేమతో బాధ్యతగా అందించిన విషయం విదితమే... వర్షాలు తగ్గినందున, పలు ప్రాంతాలు జలమయమైన ఇళ్లు బురదపేరుకు పోయి లోతట్టు ప్రాంతాల ప్రజలు చాల ఇబ్బంది పడుతున్న విషయం గమనించి ఈరోజు జిల్లా అద్యక్షులు, ఖమ్మం సమితి కన్వీనర్ గారి ఆధ్వర్యంలో యూత్ సభ్యులు పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు.. బొక్కలగడ్డ ప్రాంతం లోని సమ్మక్క సారలమ్మ దేవాలయం చక్కగా కడిగి శుభ్రము చేసి ఆ ప్రాంతం లోని 20 పైగా ఇళ్లు కూడా చక్కగా శుభ్రము చేయుట,వారికి చేయూత అందించుట జరిగింది.. అక్కడి స్థానికులు ఎంతగానో ఆనందించి ఇట్టి సేవలను కొనియాడారు. ఈ సేవా కార్యక్రమాల్లో రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ సభ్యులు శ్రీ క్రిష్ణ కుమార్ గారు, శ్రీ దయానంద్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అద్యక్షులు, ఖమ్మం సమితి కన్వీనర్ గారు, జిల్లా, సమితి కార్యవర్గ సభ్యులు, మహిళా సభ్యులు, యాక్టివ్ సభ్యులు మరియు ఖమ్మం, నేలకొండపల్లి, జక్కేపల్లి సమితి, సత్తుపల్లి సమితుల నుండి మొత్తం 56 మంది యూత్ సభ్యులు పాల్గొన్నారు.. అందరికి సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా