Narayana Seva






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 31/8/2024 నుండి ఎడతెరపి లేకుండా ఉధృతంగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం పట్టణంలోని అనేక లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు నిరాశ్రయులయి , పలు షెల్టర్స్ లో వున్న ప్రజలకు, శ్రీ సత్య సాయి నిత్యాన్న ప్రసాద సేవా కేంద్రం లో ఆహారం తయారు చేసి , 1/9/2024 రాత్రి ఫుడ్ పాకెట్స్ స్వామి కృపతో, ప్రేమతో అందించుట జరిగింది.. అదేవిధంగా 2/9/2024 రాత్రి పంపింగ్ వెల్ రోడ్డు, మామిళ్ళ గూడెం గాయత్రీ భవన్ ఏరియా, కవిరాజనగర్ ఏరియా, తుమ్మలగడ్డ తదితర ఏరియా లలో 1000 ఆహారపాకెట్స్ అందజేయుట జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు, ఖమ్మం సమితి కన్వీనర్ గారు, జిల్లా మరియు ఖమ్మం సమితి కార్యవర్గ సభ్యులు , సేవాదళ్ సభ్యులు, యూత్ సభ్యులు, యాక్టివ్ సభ్యులు ,మహిళా సభ్యులు ప్రేమతో పాల్గొన్నారు.. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా