Service






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 నిన్నటి నుండి ఎడతెరపి లేకుండా ఉధృతంగా కురుస్తున్న వర్షాలతో మధిర పట్టణంలోని అనేక లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు నిరాశ్రయులయి , మధిర 100 పడకల ప్రభుర్వ ఆసుపత్రి భవనంలో ఆశ్రయము పొందిన వారికి శ్రీ సత్యసాయి సేవా సమితి మధిర వారు సుమారు 200 మంది బాల బాలికలు మహిళలకు దుస్తులు, చీరలు, దుప్పట్లు స్వామి వారి కృపతో ప్రేమతో పంపిణీచేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీ M వెంకట మురళీ కృష్ణ గారు కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి మధిర, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ కోనా లక్ష్మి మోహనరావు గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ షఫీ ఉల్లా గారు పలువురు పుర ప్రముఖులు, సభ్యులు ప్రేమతో పాల్గొన్నారు. సాయిరాం.🙏 జిల్లా అద్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా