Pujas & Vrathams






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... స్వామి వారి 99 రోజుల దీక్షా సాధనా కార్యక్రమాలలో భాగంగా మరియు శ్రావణమాసం పురస్కరించుకుని 31 -08-24 వ తేదీ శనివారం రాత్రి 7-00 గంటలకు ఖమ్మం సమితి పరిధి , కామేపల్లి మండలం లోని పండితాపురం గ్రామములోని శ్రీ రామాలయ ప్రాంగణములో సామూహిక వరలక్ష్మి వ్రతము కుంకుమ పూజలు ఘనముగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమములో అననుకూల వాతావరణములో భారీ వర్షంలో కూడా మహిళలు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పూజలో పాల్గొని స్వామి వారి అమ్మవారి ఆశీస్సులు పొందినారు. ఈ కార్యక్రమము ను ఆదినుండి అంతము వరకు దగ్గర వుండి ఘనముగా పూర్తి చేయించిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఈకార్యక్రమమును చాల చక్కగా ,శ్రద్ధగా నిర్వహించిన ఖమ్మం సమితిలోని మహిళా సోదరీమణులకు, ఈకార్యక్రమం జరుగుటకు శ్రద్ధ వహించి చక్కటి సహకారము అందించిన గ్రామ పెద్దలకు ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందిన జిల్లా కార్యవర్గ సభ్యులు,సమితి కార్యవర్గ సభ్యులు,భక్తులు, గ్రామస్థులు ప్రతి ఒక్కరికీ సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా