Pujas & Vrathams






భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... శ్రావణ మాసమును పురస్కరించుకుని, మరియు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సేవా మహాయజ్ఞములో భాగముగా ఖమ్మం సమితికి ఎంపిక చేయబడిన గ్రామములలో దత్తత గ్రామమైన బొప్పారం గ్రామములో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణమువద్ద స్వామి వారి సన్నిధిలో 23-08-24 వతేదీ మూడవ శుక్రవారం సాయంత్రం వరలక్ష్మి వ్రత,కుంకుమ పూజలు ఘనముగా నిర్వహించు కొనుట జరిగినది. ఖమ్మం సమితి లోని మహిళల చే పూజాదికములు శాస్త్రోక్తంగా నిర్వర్తించబడినవి.ఈ పూజా కార్యక్రమము దిగ్విజయంగా పూర్తి చేయించిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ,ఈ కార్యక్రమములో భాగాస్వామ్యులైన గ్రామములోని మహిళలకు,గ్రామ పెద్దలకు మరియు సేవలందించిన మహిళా సాయి సేవకులకు సాయిరాం🙏 జిల్లా అఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా