Special Programs






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... వైరా సమితి , వైరా పట్టణం లోని శ్రీ సత్య సాయి వేద పాఠశాల లో 13/8/2024 తేదీన గోదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కృపతో, ప్రేరణతో, శ్రావణ మాసం పురస్కరించుకొని సాయి కుటుంబ సభ్యులు, నిత్య సేవాతత్పరులు, చెన్నై వాస్తవ్యులు శ్రీ వంగవీటి భాస్కర రావు గారు మరియు కుటుంబ సభ్యులు , వైరా లోని శ్రీ సత్యసాయి వేద పాఠశాల కు రోజుకు సుమారు 10 లీటర్లు పాలు ఇచ్చే అత్యంత విలువైన జెర్సీ ఆవును దూడ యుక్తంగా దానం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమం వేద పండితుల చే శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, ట్రస్ట్ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా