Special Programs






🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, గత 101రోజులుగా సత్తుపల్లి సమితి మరియు వేంసూరు సమితిలోని అన్ని గ్రామాలలో ఆయా సమితి కన్వీనర్లు ఆధ్వర్యంలో యూత్ విభాగము వారిచే అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సత్య సాయి ప్రేమరథ యాత్ర ... ఈ రోజు 102 వ రోజు వైరా వేద పాఠశాల ప్రాంగణంలో వేద పండితులచే స్వామి వారు పూజలు అందుకొని మధిర సమితి , ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో ప్రవేశించారు.. మీనవోలు గ్రామంలో స్వామి వారి ప్రేమ రథ యాత్ర అంగ రంగ వైభవంగా, అనందోత్సాహాలతో జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మధిర సమితి కన్వీనర్ , సమితి కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. సభ్యులు మరియు గ్రామస్థులు కోలాటం నృత్యాలతో స్వామి వారికి స్వాగతం పలుకుతూ ఆనందంగా పాల్గొన్నారు.. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా