Medical Camps






సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, వికారాబాద్ జిల్లా మరియు సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్, హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సాధురం కంటి వైద్యశాల,హైదరాబాద్ వారిచే ఈరోజు అనగా 28 :7 :2024 ఆదివారం కేరెల్లిలోని శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మొత్తం 212 లకు పైగా పేషెంట్స్ కి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది దీనిలో 109 మెంబర్స్ కి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. 37మందికి కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించగా 12 మందిని కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయడానికి సాధురం కంటి ఆస్పత్రి హైదరాబాద్ కి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ శిబిరంలో సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ సమన్వయకర్త చిరంజీవి రెడ్డి, శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం, కేరెల్లి ప్రధాన కార్యదర్శి శ్రీ M.ప్రేమ్ కుమార్ , శ్రీ సత్యసాయి సేవా సమితి, కేరెల్లి కన్వీనర్ శ్రీ K.రామకృష్ణారెడ్డి, సాధురం కంటి వైద్యశాల సిబ్బంది డాక్టర్ భగవాన్ గారు, డాక్టర్ అజిత్ గారు , డాక్టర్ లక్ష్మణ్ గారు,సాధురం కంటి వైద్యశాల క్యాంపు సమన్వయకర్త శ్రీ యాదగిరి గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ సత్య సాయి సేవా సమితి కేరెల్లి, సమన్వయకర్తలు మరియు సేవాదళ్ సభ్యులు, బాలవికాస్ విద్యార్థులు, ఉత్సాహంగా సేవలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. సాయిరాం🙏 లోకా సమస్తా సుఖినోభవంతు శ్రీ ఎం ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి, శ్రీ సత్య సాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం, కేరెల్లి. శ్రీ K.రామకృష్ణారెడ్డి కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, కేరెల్లి.