Special Programs






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 వైరా వేద పాఠశాల సందర్శన 27/7/2024 🌺🌺 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... ఖమ్మం జిల్లా, వైరా సమితి, వైరా లో గత 3 సంవత్సరాలుగా శ్రీ సత్య సాయి వేద పాఠశాల విజయవంతంగా నడుస్తున్న విషయం, స్వామి కృప, గురువుల నిరంతర కృషి, విద్యార్థుల దృఢ సంకల్పముతో విద్యార్థులు చక్కటి శిక్షణ పొందుతున్న విషయం విదితమే.. స్వామి వారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని 13/7/2024 నుండి 22/7/2024 వరకు నిర్వహించిన నవాహ్నిక (9రోజులు దీక్ష) దీక్షా పూర్వకంగా వారణాశి శృంగేరి పీఠం నందు మన వేద పాఠశాల విద్యార్థులు . సహస్ర చండీ సహిత అతిరుద్ర నవగ్రహ లక్ష్మి గణపతి మహామృత్యుంజయ మహాయాగం లో పాల్గొన్న విషయం కూడా తెలిసిందే.. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి సుధాకర రావు గారు, జిల్లా కార్య వర్గ సభ్యులు లెక్చరర్ శ్రీ నాగ రాజు గారు మరియు ఈ వేద పాఠశాల స్థాపనకు, అభివృద్ధికి ఎంతో విశేష కృషి సల్పిన, ఫార్మర్ రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయ కర్త శ్రీ బులుసు సాంబమూర్తి గారు ఈ రోజు వేద పాఠశాల సందర్శించి విద్యార్థులను ప్రేమతో అభినందించారు..వారితో ప్రేమగా ముచ్చటించారు..ఆశీర్వదించారు..అభివృద్ధిలోకి రావాలని కాంక్షిస్తూ స్వామిని ప్రార్ధించారు. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా