Special Programs
🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం లో 17/7/2024 బుధవారం తొలి ఏకాదశి పర్వదినము సందర్భంగా ఖమ్మం శ్రీ సత్యసాయి సేవా సమితిలోని మహిళా విభాగము వారు మరియు సాయి భక్తుల ఆధ్వర్యములో భగవానుని సన్నిధిలో ఉదయం 5-00 గంటలకు ఓంకారం, సుప్రభాతం నగర సంకీర్తన అనంతరం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సామూహిక అఖండ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం స్వామి వారి కృపతో సాయంత్రం 6-00 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగి పూర్తి అయ్యింది..సమితి రెగ్యులర్ భజన కొనసాగించి స్వామి వారికి హారతి సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం సమితి కన్వీనర్ గారు నామినేట్ చేసిన శ్రీమతి R సరిత గారిని ఖమ్మం సమితి ఆధ్యాత్మిక సమన్వయ కర్త (మహిళ) గా మరియు శ్రీ N వెంకట క్రిష్ణ గారిని ఖమ్మం సమితి విద్యా విభాగం సమన్వయ కర్త (పురుషులు) గా ఖమ్మం జిల్లా అధ్యక్షులు వారు ప్రకటించారు..అభినందించారు.పురోగతి కొరకు పలు సూచనలు చేశారు.. జిల్లా ఆధ్యాత్మిక సమన్వయ కర్త (మహిళ ) శ్రీమతి ఉష గారు ఈ కార్యక్రమాన్ని సమీక్షించారు.. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా