Special Programs
🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు తెలంగాణా రాష్ట్రము వారు రూపొందించిన కార్యక్రమము ప్రకారం కంబైన్డ్ ఖమ్మం జిల్లా (ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు) వారికి సేవాదళ్ శిక్షణా కార్యక్రమం 14/7/2024 వ తేది ఉదయం 9-30 గంటల నుండి సాయంత్రం 5-00గంటల వరకు ఖమ్మం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరంలో స్వామి వారి సమక్షంలో నిర్వహించబడింది.. వేద పఠనం, భజనానంతరం శ్రీ P వెంకట్ రావు గారు రాష్ట్ర అధ్యక్షులచే పతాకావిష్కరణ జరిగిన తరువాత , మందిర ప్రాంగణం లో ఖమ్మం జిల్లా అద్యక్షుల స్వాగతోపన్యాసం అనంతరం సేవాదళ్ శిక్షణా కార్యక్రమానికి హాజరయిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సభ్యుల నుద్దేశించి రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రసంగించారు..ఆధ్యాత్మిక, సేవా అంశాలు , ప్రశాంతి నిలయం సేవలు, ఆవశ్యకత గురించి వివరించారు.. ఆ తదుపరి శ్రీ A. వాసుదేవ రావు గారు రాష్ట్ర సర్వీస్ కోఆర్డినేటర్ గారు సేవ యొక్క విశిష్టత, ప్రాముఖ్యం గురించి కూలంకషంగా వివరించారు.. శ్రీ S యాదగిరి రావు గారు, ప్రశాంతి నిలయం సేవలు రాష్ట్ర ఇంఛార్జి గారు ప్రశాంతి నిలయం సేవలు ప్రాముఖ్యత, పాటించవలసిన, నియమ నిబంధనలు,వివిధ అంశాలు తెలిపారు.. శ్రీమతి K గీతా పావని గారు రాష్ట్ర మహిళా సేవా కోఆర్డినేటర్ గారు మహిళా సేవా యాక్టివిటీస్ గురించి మరియు స్వామి వారి శతజయంతి ఉత్సవాలు సంధర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాలు గురించి సమీక్షించారు..సూచనలు చేశారు. శ్రీ A భాస్కర్ గారు, రాష్ట్ర ఇంఛార్జి,వెబ్సైట్ మానేజ్మెంట్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..పలు అంశములు తెలిపారు.. రాష్ట్ర అధ్యక్షుల వారు కార్యక్రమాన్ని సమీక్షించి మరొకపర్యాయం ప్రశాంతి నిలయం సేవలలో కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన వలసిన ఆవశ్యకత తెలిపారు.. శ్రీ S యాదగిరి రావు గారు ప్రశాంతి నిలయం సేవలు రాష్ట్ర ఇంఛార్జి శిక్షణకు హాజరయిన సభ్యులందరిచే ప్రమాణ స్వీకారం వేడుక నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుల వారు సేవాదళ్ శిక్షణకు హాజరయిన సభ్యులందరికీ ట్రైనింగ్ సర్టిఫికెట్స్ అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఉభయ జిల్లాల అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్లు, కార్యవర్గ సభ్యులు, భజనమండలి కన్వీనర్లు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, యాక్టివ్ సభ్యులు 190 మంది హాజరయ్యారు. స్వామి వారికి హారతి సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.. సాయిరాం.🙏 జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా