Special Programs





🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... ఖమ్మం జిల్లా, వైరా సమితి, వైరా లో గత 3 సంవత్సరాలుగా శ్రీ సత్య సాయి వేద పాఠశాల విజయవంతంగా నడుస్తున్న విషయం, స్వామి కృప, గురువుల నిరంతర కృషి, విద్యార్థుల దృఢ సంకల్పముతో విద్యార్థులు చక్కటి శిక్షణ పొందుతున్న విషయం విదితమే.. స్వామి వారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని 13/7/2024 నుండి 22/7/2024 వరకు నవాహ్నిక (9రోజులు దీక్ష) దీక్షా పూర్వకంగా వారణాశి శృంగేరి పీఠం నందు మన వేద పాఠశాల విద్యార్థులచే.. సహస్ర చండీ సహిత అతిరుద్ర నవగ్రహ లక్ష్మి గణపతి మహామృత్యుంజయ మహాయాగం నిర్వహించబడుతున్నది.. ఈ సందర్భంగా మొదటి రోజు కార్యక్రమం పవిత్ర కాశీ పుణ్య క్షేత్రం లో... స్వామి వారి ఆశీస్సులు వేద విద్యార్థులకు, గురువర్యులకు నిండుగా వుండాలని ప్రార్థిస్తూ... సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా