Balvikas
🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... బాలవికాస్ సెంటర్ వార్షికోత్సవ వేడుకలు *** ఖమ్మం సమితి, ఖమ్మం పట్టణం మమత హాస్పటల్ రోడ్, హార్వెస్ట్ స్కూల్ దగ్గర సప్తవర్ణ అపార్ట్మెంట్ లో నిర్వహిస్తున్న బాలవికాస్ సెంటర్ ప్రారంభించుకొని ఒక సంవత్సరం పూర్తి అయినందున ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఎంతో అంకిత భావంతో, నిస్వార్థంగా, ప్రేమతో బాల బాలికల శ్రేయస్సు, ఉజ్వల భవిష్యత్తు కొరకు క్రమం తప్పకుండా బాలవికాస్ తరగతులు నిర్వహిస్తున్న శ్రీ K లక్ష్మీనారాయణ గారు శ్రీమతి క్రిష్ణకుమారి దంపతుల మరియు బాల వికాస్ గురువుల సేవలను పలువురు వక్తలు కొనియాడారు.. భాలవికాస్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు వారి వారి అనుభూతులు అభిప్రాయాలు తెలిపారు.. తమ పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు చేస్తున్న నిరంతర కృషిని పేరెంట్స్ శ్లాఘించారు.. విద్యార్థులు గత సంవత్సర కాలంగా ఎంతో నేర్చుకున్నామని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా విద్యావిభాగ్ కోఆర్డినేటర్,జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం సమితి కార్యవర్గ సభ్యులు, పలువురు బాలవికాస్ గురువులు, సప్త వర్ణ అపార్ట్మెంట్ వాసులు, బాలవికాస్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఖమ్మం సమితి సభ్యులు పాల్గొన్నారు.. బాలవికాస్ విద్యార్థులకు గ్రూప్ I సర్టిఫికెట్లు బహూకరించడం జరిగింది. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.. బాలవికాస్ విద్యార్థులచే కేక్ కటింగ్ వేడుక ఆహ్లాదంగా జరిగింది.. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ గా, సంగీత విద్వాంసురాలుగా, బాలవికాస్ గురువుగా విశిష్ట సేవలు అందించి జూన్ 30 వ తేదీన ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పదవీ విరమణ చేసిన శ్రీమతి స్వర్ణకుమారి గారు శ్రీ శర్మ గారు దంపతులను బాలవికాస్ గురువులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈరోజు జరిగిన వేడుకల్లో ఘనంగా ప్రేమతో సన్మానించుకోవడంజరిగింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి హారతి సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయిసేవా సంస్ధలు ఖమ్మం జిల్లా