Special Programs






🙏ఓం శ్రీ సాయిరామ్ 🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 🌺శ్రీ సత్యసాయి ప్రేమ రథ యాత్ర - కల్లూరు మండలము 30/6/24🌺 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో .....స్వామి వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా, స్వామి వారి దివ్య దర్శనం ఖమ్మం జిల్లా లోని మొత్తం 587 గ్రామాలలోని ప్రజలకు కలిగించాలని, స్వామి ప్రేమను ప్రతి ఒక్కరికీ పంచాలన్న సంకల్పము మేరకు 5/3/2024 వ తేదీన శ్రీ RJ రత్నాకర్ గారు , మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వారిచే సత్తుపల్లి శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవా నిలయం ప్రాంగణంలో ప్రారంభించుకొని, స్వామి వారి అపారమైన ప్రేమ తో 28/6/2024 వరకు సత్తుపల్లి సమితి లోని సత్తుపల్లి , పెనుబల్లి మండలాలు మరియు వెంసూరు సమితి లోని అన్నిగ్రామాలలో మొత్తం 76 గ్రామాలలో పూర్తి చేయుట జరిగినది.. ప్రతి గ్రామం లోనూ స్వామి వారికి ఘన స్వాగతం పలుకుతూ, మంగళ నీరాజనములు సమర్పిస్తూ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి దర్శనము చేసుకొని ఆనందించారు.. ఆశీస్సులు పొందారు..స్వామి వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తున్నా ము. స్వామి వారి అపారమైన ప్రేమ తో 29/6/2024 తేదీన సత్తుపల్లి సమితి , కల్లూరు మండలము లో ప్రవేశించి రామకృష్ణాపురం , ఎర్రబంజర గ్రామాలలో నిర్వహించుకుని 30/6/2024 తేదీన ఆదివారం నాడు సత్తుపల్లి సమితి ఆధ్వర్యంలో యువజన విభాగం వారిచే 78వ శ్రీ సత్యసాయి ప్రేమ రథ యాత్ర నారాయణపురం కొర్లగూడెం గ్రామాలలో అత్యంత వైభవంగా నిర్వహించబడింది... ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు.. ఈ సందర్భంగా నారాయణపురం గ్రామంలో భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకున్న మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మాతృమూర్తికి స్వామి వారి మెమోంటో జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ గారిచే బహూకరించడం జరిగింది. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా