Special Programs






ఓం శ్రీ సాయిరామ్ 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ....స్వామి వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం సమితి లోని యువజన విభాగం వారి ఆధ్వర్యములో నిర్వహించే 100 పల్లకీ సేవలలో భాగముగా 16-06-24 వ తేదీ ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్ఛగూడెం గ్రామములో 68 వ పల్లకీ సేవను అంగ రంగ వైభవంగా నిర్వహించుట జరిగినది. ఈసేవలో గ్రామ వాసులందరూ పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి వారినీ పల్లకీ లో వీధి వీదినా విహరింప చేస్తూ అందరికీ దర్శన భాగ్యం కలిగించారు.గ్రామ వాసులందరు స్వామి వారు తమ ఇంటి ముందుకు వచ్చినప్పుడు నీరు వారగ పోసి మంగళ నీరాం జనములు సమర్పించి స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు.ఈ సేవాకార్యక్రమములో ఖమ్మం సమితి సభ్యులు,భక్తులు, జిల్లా బాధ్యులు,యూత్ సభ్యులు , మహిళలు, అందరూ పాల్గొని తమ వంతు సేవా పుష్పమును స్వామి వారికి సమర్పించారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ,ఖమ్మం జిల్లా