Special Programs






ఓం శ్రీ సాయిరామ్🙏 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🪷🪷 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ...ఖమ్మం పాత బస్ స్టాండ్ ఆవరణలో వేసవి ఎద్దడి దృష్ట్యా ప్రతి సంవత్సరం ఖమ్మం సమితిలోని మహిళా విభాగం వారిచే నిర్వహించబడే సేవా కార్యక్రమాలలో బాట సారుల దాహార్తిని తీర్చే నిమిత్తమై ఈ సంవత్సరం ఉగాది పర్వదినం రోజున ప్రారంభించ బడి 16/6/2024 సాయంత్రం వరకు కొనసాగించిన సేవలలో శ్రీ సత్యసాయి జల ప్రసాద వితరణ సేవా కేంద్రము (చలివేంద్రము) లో చక్కటి సేవలందించి స్వామి వారి ఆశీస్సులు పొంది, ప్రస్తుతం వాతావరణములో లోని మార్పుల కనుగుణంగా 16/6/2024 సాయంత్రం 4 గంటలకు ఈ సేవా కార్యక్రమ మును స్వామి వారికి మంగళ హారతి సమర్పించి,ముగింపు చేయుట జరిగినది. అలాగే పాత బస్ స్టాండ్ ఆవరణలో పనిచేసే పారిశుధ్య కార్మిక మహిళలకు ఖమ్మం సమితి లోని మహిళా విభాగం వారి ఆధ్వర్యములో దుస్తులు పంపిణీ చేయుట జరిగినది. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా