Special Programs


శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి సమితి మండ్రాజుపల్లి తండాలో శ్రీ భూక్యా శ్రీను శ్రీమతి రేణుక దంపతుల కుమార్తె చి: రమాదేవి వివాహము ఈరోజు జరుగుతున్న శుభ సందర్బంగా వారి అవసరాన్ని గుర్తించి, స్పందించి 31/5/2023 తేదీన నేలకొండపల్లి సమితి కన్వీనర్ శ్రీ గెల్లా వెంకటరమణ గుప్తా గారు, శ్రీ వంగవీటి భాస్కరరావు గారు, శ్రీ వంగవీటి క్రిష్ణ మూర్తి గారు,మరియు సాయి సభ్యులు వారి ఇంటికి వెళ్లి బంగారు మంగళసూత్రం, కానుకలు పెళ్ళికూతురుకు అందజేసి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి స్వామి వారి ఆశీస్సులు ప్రేమతో అందించుట జరిగినది. సాయిరాం🙏 జిల్లా ఆఫిస్ ఇంచార్జ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా