Service


Om sri Sairam ఖమ్మం జిల్లా, ఖమ్మం సమితి, తిమ్మినేనిపాలెం గ్రామ నివాసి శ్రీమతి చింతనిప్పు లక్ష్మి (45) తీవ్ర అస్వస్థతకు గురి అయిన విషయం దృష్టి కి రాగా, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఖమ్మం జిల్లా అధ్యక్షులు, స్టేట్ మెడికల్ టీమ్, శ్రీ భాస్కర రావు గారిని సంప్రదించి, వారి సూచనలు మేరకు 6/10/2023 తేదీన మెడికల్ రిపోర్ట్స్ పంపగా ,Dr Anil Kumar Mulpur గారు పరిశీలించి ఇచ్చిన వారి సలహా మేరకు పేషెంట్ ను 11/10/2023 తేదీన హైదరాబాద్ పంపి డాక్టర్ గారి పరీక్షల అనంతరం హార్ట్ డిసీజ్ గా గుర్తించి తదుపరి చికిత్స కొరకు కరీంనగర్ అపోలో హాస్పిటల్ కు పంపటం జరిగింది.. స్వామి అనుగ్రహంతో వారు 12/10/2023 తేదీన అంజియోగ్రామ్ తదితర పరీక్షలు నిర్వహించి, అడ్మిట్ చేసుకొని,అత్యుత్తమ సేవలు అందించి, 13వ తేదీన Dr అనిల్ కుమార్ మల్పుర్ గారు , ప్రముఖ కార్డియాలజిస్ట్ ఆపరేషన్ ( OS ASD (Atrial septal defect) closure and Tricuspid volve repair) చేసి 17/10/2023 తేదీన డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపుట జరిగినది.. పేషెంట్ కుటుంబ సభ్యులకు అవసరమైన భోజనవసతి శ్రీయుత జిల్లా అధ్యక్షులు కరీంనగర్ వారు ప్రేమతో అందించారు.. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో త్వరితగతిన కోలుకున్న శ్రీమతి లక్ష్మి గారిని 22/10/2023 తేదీన , వారు ప్రస్తుతము వున్న పెదమండవ గ్రామంలో వారి ఇంటివద్ద జిల్లా అధ్యక్షులు, జిల్లా కోఆర్డినేటర్లు ఇతర సభ్యులు కలిసి పరామర్శించడం జరిగింది.. త్వరలో పూర్తిగా కోలుకోవాలని కోరుతూ స్వామి వారి ప్రసాదం అందించుట జరిగింది.. ఊహించని రీతిలో తన ప్రాణాలను కాపాడిన స్వామికి ఆమె తన కృతగ్యతలు, శతకోటి ప్రణామములు తెలిపారు.. విలువైన ఆపరేషన్ ఉచితంగా చేసి,ప్రేమతో సేవలు అందించిన డాక్టర్లకు, సంస్థ సభ్యులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.. సాయిరాం 🙏 జిల్లా అఫీస్ ఇంచార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా