Bhajans
ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీసాయిరాం శ్రీ సత్యసాయిసేవాసంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 వేంసూరు సమితిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 98వ జన్మదిన వేడుకలు 23 నవంబర్ 2023 *** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా, వేంసూరు సమితిలో స్వామి వారి జన్మదిన వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి.. ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన , .చత్రముతో స్వామివారి ఊరేగింపు, భజన, సత్సంగము తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ▶️ వేంసూరు లోని ఆరోగ్య మాత హాస్పిటల్లో డాక్టర్ సత్య సాయి కుమార్ గారు మరియు మేనేజ్మెంట్ వారితో కలిసి పండ్లు పంపిణీ ▶️ వన సమారాధన - ఆటల పోటీలు.. ఆటపాటలకు బహుమతులు ▶️ వేంసూరు వృద్ధాశ్రమంలో వేడుకలు, కేక్ కటింగ్, పండ్లు పంపిణి ▶️ యర్రగుంటపాడు గ్రామంలో 98 గిరిజన కుటుంబాలకు డాక్టర్ సత్యసాయి కుమార్ గారి చేతులమీదుగా అమృత కలశాల పంపిణీ, రగ్గులు, నూతన వస్త్రాలు, చిన్న పిల్లలకి ఆట వస్తువులు పంపిణీ ▶️ వృద్ద దంపతులకు ప్రేమతో చేయూత ▶️జన్మదిన వేడుకలు, కేక్ కటింగ్ ▶️ స్వామి వారికి హారతి సమర్పణతో కార్యక్రమాలు ముగింపు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా