Special Programs
ఓం శ్రీ సాయిరాం, 🌹భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం,యువజన విభాగం వారు దీపావళి సంబరాలను ఖమ్మం జిల్లా, ఏన్కూర్ మండలం, కొత్తమేడేపల్లి అనే ఆదివాసీ గిరిజన గ్రామంలో స్వామి ప్రేమతో జరిపారు. దట్టమైన అడవిలో చీకటిలో జీవిస్తున్న వీరికి గత 6 సంవత్సరాలనుండి (2018 ) స్వామి వారి సేవలు అందుతున్నాయి,2020 సంవత్సరం నుంచి అక్కడ నడుస్తున్న NCLP స్కూల్ విద్యార్థులకు హెల్త్ అండ్ హైజెన్ కిట్స్ ఇస్తూ వారిని ఉన్నత చదువులకు ప్రోత్సహించటం జరుగుతున్నది,చీకటిలో వారు చదువుకోవటం కష్టం గా ఉండటం వలన 50 ఇళ్లకు సోలార్ లాంతర్లుఇచ్చి విద్యార్థులను ఉన్నత చదువులకు ప్రోత్సహించుటజరిగినది.. ఇప్పటికి సుమారుగా 14 మంది విద్యార్థులు తెలంగాణా రెసిడెన్సిల్ స్కూల్లో స్వామి ప్రేమతో సీట్స్ సంపాదించారు.వారి ఉన్నత చదువులకు వారి దగ్గర ఉండి చూసుకొంటున్న స్వామి వారికీ శతదా కృతజ్ఞతలు.. ఇలాంటి సేవలలో పాల్గొనే అవకాశం కల్పించిన స్వామికి నమస్సుమాంజలులు తెలుపుతూ సాయిరాం🙏🙏 శ్రీ సత్యసాయి సేవా సమితి, యువజన విభాగం, ఖమ్మం