Balvikas






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో .. మాతృశ్రీ ఈశ్వరాంబ డే వారోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా, వైరా సమితి వేద పాఠశాలలో జిల్లా స్థాయిలో 1/5/2024 నుండి 6 day Residential Summer Course శిక్షణ నిర్వహించుకుని , భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మాతృశ్రీ ఈశ్వరమ్మ ను స్మరిస్తూ 06/05/2024 సోమవారం ముగింపు ఉత్సవము మరియు *మాతృ పూజలు* జిల్లా విద్యా విభాగము, బాలవీకాస్ వారిచే శ్రీ సత్యసాయి వేద పాఠశాల, వైరా వేదికగా ఘనంగా నిర్వహించబడినవి. శ్రీ హరనాధ రెడ్డి గారు State co-ordinator , Education wing, SSSO Telangana వారు, శ్రీ రఘు గురూజీ , యోగా గురు& మోటివేషనల్ స్పీకర్ మరియు శ్రీ D సుధాకర రావు గారు జిల్లా అద్యక్షులు ఈకార్యక్రమంలో ప్రేమతో పాల్గొని ప్రసంగించారు.. వేసవి శిక్షణా శిబిరం చక్కగా నిర్వహించిన విద్యా విభాగము కోఆర్డినేటర్స్ వారిని, బాలవికాస్ గురువులను, శిక్షణలో పాల్గొన్న విద్యార్థులను వారి పేరెంట్స్ ను కొనియాడారు.. ఈరోజు ఉదయం ఓంకారము, సుప్రభాతము, నగరసంకీర్తన తో ప్రారంభమైన కార్యక్రమాలు తదుపరి అభిషేకము, గోసేవ , అతిథులచే జ్యోతి ప్రజ్వలన, వారి సందేశాలు, EHV తరగతుల పై అవగాహన విద్యార్థినీ విద్యార్థులకు, participation certificates బహూకరణ , మాత్రుపూజ మొదలైన కార్యక్రమాలతో కొనసాగి స్వామి వారికి హారతి సమర్పణ తో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. విద్యార్ధులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.. ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, ట్రస్టు సభ్యులు, వైరా సమితి, ఇతర సమితి కన్వీనర్లు, భజన మండలి కన్వీనర్లు, భక్తులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, బాలవికాస్ గురువులు విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా