Special Programs






🙏🏻ఓం శ్రీ సాయిరాం 🙏🏻 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ... ఈరోజు అనగా 09-04-24 వతేదీ మంగళవారం ఉగాది పర్వదినము రోజున ఖమ్మం సమితి, ఖమ్మం పట్టణము లో ఉదయం సుప్రభాత సేవను ఘనముగా పూర్తిచేసుకుని, ఉదయం 9-00 గంటలకు ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద చలివేంద్రం ప్రారంభించుకుని, తిరిగి సాయంత్రం ఖమ్మం శ్రీ సత్యసాయి మందిరములో 5.30 గంటలకు వేదపఠనం భజన తో కొనసాగి 6.30 గంటలకు పంచాంగ శ్రవణం జరిగింది.. ప్రముఖ వేద పండితులు,శ్రీ వడ్లమాని సుబ్రహ్మణ్య శర్మ అవధాని గారు స్వామి తత్త్వాన్ని తెలియజేసి, క్రోధినామ సంవత్సర రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, అనేక విషయాలు తెలియజేశారు..వేద ఆశీర్వచనం తరువాత వారికి ఖమ్మం సమితి కన్వీనర్ మరియు కార్యవర్గ సభ్యులచే ప్రేమతో వేదపండిత సత్కారం జరిగింది. స్వామి వారి దివ్య అనుగ్రహ భాషణం (వీడియో) ప్రదర్శన తరువాత అవధాని గారిచే స్వామి వారికి మహామంగళహారతి సమర్పణ అనంతరం స్వామి వారి దివ్య దర్శనంతో కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం సమితి కన్వీనర్ గారు , సమితి కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,మహిళలు, యూత్ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి ,శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా