Pujas & Vrathams






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా *** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామి వారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 72వ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 1/10/2023 ఆదివారం నాడు నేలకొండపల్లి సమితి నేలకొండపల్లి మందిరంలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది.. వేదపండితులు, శ్రీ సత్యసాయి వేద పాఠశాల వైరా గురువు గారు, విద్యార్థులు సాయిభక్తులు పాల్గొని ఈ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు..ఈ కార్యక్రమంలో ప్రారంభం నుండి ముగింపు వరకు రంగారెడ్డి జిల్లా అద్యక్షులు మరియు రాష్ట్ర ప్రశాంతి సేవల ఇంఛార్జి శ్రీ S యాదగిరి రావు గారు మరియు రాష్ట్ర అధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీ R అనిల్ కుమార్ గారు పాల్గొని కార్యక్రమం నిర్వహించి, అనంతరం కార్యక్రమ విశిష్ఠత,ఇతర అంశాలు, ప్రశాంతి సేవలు గురించి ప్రసంగించారు.. ఖమ్మం జిల్లా అద్యక్షులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి విజయవంతం చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి కృతఙ్ఞతలు తెలుపుతూ, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అనుగ్రహించమని కోరారు.. ఈకార్యక్రమంలో జిల్లా నలుమూలలనుండి అన్ని సమితుల కన్వీనర్లు, భజన మండలి కన్వీనర్లు, జిల్లా మరియు సమితి కార్యవర్గ సభ్యులు, మహిళలు, యూత్ సభ్యులు, బాలవికాస్ గురువులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంచార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా..