Service






🙏🏻ఓం శ్రీ సాయిరాం 🙏🏻 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఖమ్మం TSRTC పాత బస్టాండ్ ఆవరణలో వేసవి లో ఖమ్మం సమితి లోని మహిళా విభాగ సభ్యులచే జల ప్రసాద సేవ ( చలివేంద్రం) నిర్వహించటం జరుగుతున్నది.ఈ సంవత్సరం అధిక వేసవి కారణముగా ఈరోజు అనగా 09-04-24 వ తేదీన ఉగాది పర్వదినము రోజున ఉదయం 9-00 గంటలకు స్వామి వారి కృపతో, ఆశీస్సులతో చలివేంద్రము ప్రారంభించుట జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు, ఖమ్మం సమితి కన్వీనర్ గారు, జిల్లా, సమితి కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగము వారు, యూత్ విభాగము వారు, భక్తులు, యాక్టివ్ సభ్యులు పాల్గోన్నారు. జిల్లా మహిళా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ గారు, చలివేంద్రం ప్రాముఖ్యత మరియు నిర్వహణ గురించి వివరించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాసరావు గారు ఖమ్మం TSRTC డిపో మేనేజర్ గారు మాట్లాడుతూ మండు వేసవిలో శ్రీ సత్య సాయి సేవా సంస్ధల వారు చలివేంద్రము ద్వారా ఎంతో అవసరమైన మంచి నీరు అందిస్తూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారని, తాము, తమ సిబ్బంది కూడా నిస్వార్థమైన ఇట్టి సేవలో పాల్గొనేందుకు సిద్ధమన్నారు.. ఈసేవను అవసరమైన సమయంలో ప్రారంభించటం అభినందనీయమన్నారు. సాయిరాం. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా