Special Programs






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో .... తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వారి ఆదేశము ప్రకారం ఖమ్మం జిల్లా స్థాయి భజన శిక్షణ మరియు జ్యోతి ధ్యానం శిక్షణ కార్యక్రమం ఈరోజు 7/4/2024 ఉదయం 10 గంటలకు ఖమ్మం సమితి, ఖమ్మం పట్టణంలో భగవాన్ బాబా వారి మందిరంలో నిర్వహించబడినది. తొలుత ఖమ్మం సమితి కన్వీనర్ గారు సభను ప్రారంభించిన తదుపరి జిల్లా అధ్యక్షుల వారి ప్రసంగం కొనసాగినతదుపరి జ్యోతి ధ్యానము గురించి శ్రీ R.V. రామారావు గారు చాలా చక్కగా వివరించుట జరిగినది. తదుపరి భజన శిక్షణ గురించి శ్రీ KVSS కిశోర్ గారు వివరించుట జరిగినది.మన దగ్గర ఇటువంటి చక్కటి కార్యక్రమము జరిపించిన స్వామి వారికి కృతజ్ఞతలు సమర్పించి, ఈకార్యక్రమంలో శిక్షణ నిచ్చిన ప్రధాన శిక్షకులకు సంస్థ తరపున ధన్యవాదాలు తెలియచేసిన తదుపరి స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమం ముగిసింది .సాయిరాం. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా