Special Programs






ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ అశీస్సులతో... స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య దర్శనం మరియు వారి అనుగ్రహ ఆశీస్సులు ఖమ్మం జిల్లా లోని 587 గ్రామాలలో ప్రతి ఒక్కరికీ అందాలని , స్వామి వారి శత జయంతి ఉత్సవాల్లో ప్రశాంతి నిలయంలో అందరూ స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటూ, స్వామి వారి ప్రేమ రథాన్ని శ్రీ RJ రత్నాకర్ గారు, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రశాంతి నిలయం వారిచే మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారిచే సత్తుపల్లి లోని శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవా నిలయం ప్రాంగణంలో 5/3/2024 తేదీన ప్రారంభించుకున్న తదుపరి ఇట్టి భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమ రథయాత్రను జిల్లాలో కొనసాగింపుగా సత్తుపల్లి సమితి మేడిశెట్టివారిపాలెం గ్రామం నుండి 14/3/2024 గురువారం సాయంత్రం 5-00గంటలకు ప్రారంభించుట జరిగినది. హాజరైన జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సత్తుపల్లి సమితి కన్వీనర్, సమితి సభ్యులు,మహిళా సభ్యులు మరియు అధిక సంఖ్యలో హాజరైన యూత్ సభ్యులు.. ప్రేమతో, భక్తితో స్వాగతం పలుకుతున్న మహిళలు... గ్రామస్తులు... సాయిరాం🙏