ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... 98.వ జయంతోత్సవములు శ్రీ సత్య సాయి సేవ సమితి గోదావరిఖని లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది కార్యక్రమ వివరాలు. భగవాన్ శ్రీ సత్య సాయి పుట్టు పండుగ సందర్భంగా ఉదయం ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తన వేద పఠనం స్వామికి అష్టోత్తర శతనామావళి పూజ. ఉదయం 10 గంటలకు సామూహిక శ్రీ సత్యసాయి వ్రతాలు. మధ్యాహ్నం 1:00 కు నారాయణ సేవ( అన్నదానం)450మందికి. సాయంత్రము సామూహికవేద పారాయణం భజన బాలవికాస్ విద్యార్థులచే సాంస్కృత కార్యక్రమాలు ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరిగింది. జన్మదినోత్సవ కేక్ కటింగ్ . బాలవికాస్ విద్యార్థులు మరియు సాయి కుటుంబ సభ్యులచే జిల్లా అధ్యక్షులు బి వెంకట స్వామి గారు నేషనల్ క్విస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటేషన్ విద్యార్థులకు బహుమతి ప్రధానం.చేసి స్వామి వారి సందేశం ఇవ్వడం జరిగింది. కన్వీనర్ శంకరయ్య గారు హారతి ఇచ్చి సమితి రిపోర్టు తెలియజేయడం జరిగింది. తరువాత ఉయ్యాల ఉత్సవం ప్రసాద వితరణ. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జిల్లా కోఆర్డినేటర్లు సమితి కన్వీనర్ సమితి కోఆర్డినేటర్లు సాయి కుటుంబ సభ్యులు భక్తులు సుమారు 250 మంది పాల్గొన్నారు. జన్మదినోత్సవంలో పాల్గొన్నవారు అందరికీ స్వామి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. సదా సాయి సేవలో... కన్వీనర్. శ్రీ సత్య సాయి సేవ సమితి గోదావరిఖని పెద్దపల్లి జిల్లా