Sri Sathya Sai Grama Seva MahaYagnam




Tue Jul 10 2018 21:25:42 GMT+0000 (Coordinated Universal Time)
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవా సమితి, నిజాంపల్లి పరిధి లోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని హనుమాన్ ఆలయంలో భజనలు నిర్వహించడం జరిగింది. తరువాత వీధి వీధిన స్వామివారి పల్లకీసేవ నిర్వహించి స్వామివారి విభూతి ప్రసాదం అందజేయడం జరిగింది.అలాగే గ్రామంలోని తొమ్మిది మంది నిరుపేద కుటుంబాలకి దుప్పట్లు పంపిణీ చేయడం తో పాటు వారికి స్వామివారి ఫోటో ఇవ్వడం జరిగింది తరువాత బాలవికాస్ క్లాస్ నిర్వహించి పిల్లలకి విభూతి ప్రసాదం, బిస్కెట్ పాకెట్స్ అందజేయడం చివరగా గ్రామదేవత ల విగ్రహాల వద్ద స్వచ్ఛత సేవ చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పురుషులు 40 మంది, మహిళలు 20 మంది, బాలవికాస్ పిల్లలు 15 మంది పాల్గొన్నారు. వీరందరికి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరెన్నో సేవలలో పాల్గొనేందుకు శక్తిని, యుక్తిని స్వామివారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... సదా సాయి సేవలో Ch మల్లా రెడ్డి, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి యువజన విభాగం జయశంకర్ భూపాలపల్లి జిల్లా