ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా ** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా, ఖమ్మం సమితి, ఖమ్మం పట్టణంలో శ్రీ సత్యసాయి వైద్య సేవా సదన్ లో నిర్వహిస్తున్న మెడికల్ సర్వీస్ స్వామి వారి అనుగ్రహముతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సిల్వర్ జూబ్లీ మహోత్సవ కార్యక్రమం - మెడికల్ కాన్ఫరెన్స్ తేదీ 2/11/2023 సాయంత్రం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిర ప్రాంగణములో అత్యంత ఘనంగా జరిగాయి., ఈ కార్యక్రమంలో విశిష్ఠ అతిధులుగా Dr రాధా రమణ మూర్తి గోకుల గారు M.D., C.M.D., Dip.ABLM USA (ప్రముఖ ఆధ్యాత్మికవేత్త , వక్త, వివిధ రంగాలలో నిష్ణాతులు ) శ్రీ G భాస్కరరావు గారు State Incharge for medical services శ్రీ క్రిష్ణ కుమార్ గారు నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ దమ్మాలపాటి సుధాకర్ రావు గారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.. శ్రీ A నరసింహారావు గారు ఖమ్మం సమితి కన్వీనర్ మరియు Dr T వాసుదేవ్ గారు జిల్లా మెడికల్ సర్వీసెస్ ఇంఛార్జి స్వాగతం పలికి గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వివిధ వైద్య సేవలు గురించి తెలిపారు .. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా విశిష్ట ఉచిత వైద్య సేవలు ప్రేమతో అందించిన, ప్రస్తుతం అందిస్తున్న డాక్టర్స్ అందరికీ , మెడికల్ విభాగ సభ్యులు అందరికి, స్టేట్ మెడికల్ టీమ్ కు, ప్రత్యేక ప్రేమపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు.. గత అనుభవాలు దృష్టియందుంచుకొని ఇంకా విస్తృత వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకొని, సేవలు కొనసాగించాలని సభ్యులను కోరారు. శ్రీ G భాస్కర్ రావు గారు State Medical Services Incharge , ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణంలో జరుగుతున్న అల్లోపతి, హోమియోపతి వైద్య సేవలు మరియు మధిర లో జరుగుతున్న ఆయుర్వేద వైద్య సేవలు ప్రశంసిస్తూ, జిల్లా నుండి రిఫర్ చేసిన పేషెంట్లకు రాష్ట్రస్థాయిలో అందించిన విలువైన వైద్య సేవలు, సర్జరీలు గురించి, followup కేసులగురించి వివరించారు..Telemedicine సేవలు గురించి తెలిపారు. పలు సూచనలు ఇచ్చారు శ్రీ క్రిష్ణ కుమార్ గారు నేషనల్ కోఆర్డినేటర్ గారు వైద్యపరమైన అనేక విషయాలు తెలుపుతూ జిల్లాలో Vocational Nursing Training center ప్రారంభించ వలసినదిగా కోరారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, వక్త, వివిధరంగాలలో నిష్ణాతులు, ప్రముఖ వైద్య నిపుణులు Dr రాధా రమణ మూర్తి గోకుల గారు MD., CMD., Dip.ABLM USA అనేక వైద్యపరమైన విషయాలు Power point presentation ద్వారా తెలిపారు.. Telemedicine ప్రాముఖ్యత, తాము ఇండియాలోను ఇతర దేశాలలోను నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు గురించి తెలిపారు.. ఈ సందర్భంగా సెప్టెంబర్ 2023 లో రాష్ట్ర స్థాయిలో, పాఠశాల స్థాయి, కళాశాల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థి, విద్యార్థినులకు Certificates అతిథులచే అందించుట జరిగింది. ఖమ్మం సమితి మరియు వైద్యసేవల అభివృద్ధికి నిరంతరం శ్రమించిన సీనియర్ డివోటీ శ్రీ చల్లా కృష్ణమూర్తి గారిని సన్మానించడం జరిగింది. వైద్య విభాగంలో విశిష్ట సేవలు అందించిన కీర్తిశేషులు Dr వేములపల్లి రాజారావు గారి సేవలు స్మరిస్తూ వారి కుమారుడు శ్రీ వేములపల్లి రాంబాబు గారికి మేమొంటో అందజేయడం జరిగింది.. అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న పలువురు డాక్టర్స్ కు మేమొంటోస్ బహూకరించడము జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు , సమితి కన్వీనర్లు , కార్యవర్గ సభ్యులు , భజనమండలి కన్వీనర్లు, సేవాదళ్ సభ్యులు యూత్ సభ్యులు, మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. సాయిరాం 🙏 జిల్లా అఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా