సాయిరాం🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు(7.9.2023) శ్రీ సత్యసాయి సేవా సమితి, కేరెల్లి ఆధ్వర్యంలో గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు . భక్తిశ్రద్ధలతో ఉట్టి పగలగొట్టడం మరియు పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులచే శ్రీ కృష్ణా మరియు గోపిక వేషధారణలతో ఊరేగింపు నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం జరిగింది. పులిహోర మరియు స్వీట్స్ ప్రసాద పంపిణీ చేయడం జరిగింది. కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, కేరెల్లి,వికారాబాద్ జిల్లా. సాయిరాం🙏