🔹 నాల్గవ (4th) భజన కేంద్రము ఆరంభం 🔹 నిన్నటి రోజు అనగా మంగళవారం నాడు రాష్త్ర సర్క్యూలర్ 24 ఆధారంగా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి , జగిత్యాల ఆధ్వర్యంలో 4వ భజన కేంద్రమును శ్రీ వంగల లక్ష్మీనారాయణ - పద్మజ గారింట్లో ఆరంభించుకోవడం జరిగింది. ఇప్పటినుండి ప్రతి మంగళవారం వారింట్లో భజన నిర్వహించడం జరుగుతుంది. వారి ఇంటి చుట్టుపక్కల వారు లేదా భజన లో పాల్గొని స్వామి హారతి తీసుకోవాలని అనుకొనే వారెవరైనా ఇప్పటినుండి వారింట్లో జరిగే భజనలో పాల్గొనవచ్చు , తద్వారా స్వామి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు 🙏 స్వామి దయతో ముందు ముందు మరిన్ని భజన కేంద్రాలు ఏర్పరచుకొనే అవకాశాన్ని మనకు కల్పించాలని స్వామిని ప్రార్థిస్తున్నాం. 🙏జై సాయిరాం🙏 భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల