Medical Camps


ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్య సాయి సేవ సమితి వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లా దంత వైద్య శిబిరం, చీదేడు గ్రామం, మంచాల మండలం తేదీ 22.4.23. భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో గ్రామసేవలలో భాగంగా నిన్న 22 - 4 - 2023 శనివారం నాడు మంచాల మండలంలోని చీదేడు గ్రామంలో బాలబాలికలకు దంత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ దంత వైద్య శిబిరంలో ప్రముఖ దంత వైద్యులు డా.శ్రీకాంత్ గారు MDS, మరియు వారి సహాయ డాక్టరు వైద్య సేవలందించారు. ఈ దంత వైద్య శిబిరంలో బాలబాలికలు - 94 పెద్దలు - 04 వైద్య సేవలందుకున్నారు. వీరందరికీ దంత పరీక్షలు గావించి అందరికీ Toothbrush మరియు Tooth Paste ఇవ్వడం జరిగింది. వీరిలో 9 మంది పిల్లలకు మరియు 2 పెద్దలకు తదుపరి దంత వైద్యం అవసరమని నిర్ధారించడమైనది. వీరిని త్వరలో వనస్థలిపురం తీసుకుని వచ్చి డా.శ్రీకాంత్ గారి Clinic లో తదుపరి వైద్యం అందించబడుతుంది. ఈ సేవలు భగవాన్ బాబా వారి పాదపద్మములచెంత సమర్పిస్తూన్నాము. జైసాయిరాం. కె. కృష్ణ కుమార్, కన్వీనర్, వనస్థలిపురం సమితి