Balvikas




🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ........... అందరికి సాయిరాం స్వామి వారి దివ్యాశిశులతో........... శ్రీ సత్య సాయి సేవా సమితి, పెద్దపల్లి లో ఈ రోజు సమితి అన్ని విభాగాల మహిళా, ఆధ్యాత్మిక, యూత్, బాలవికాస్ మహిళా కో ఆర్డినేటర్స్, సేవాదళ్ అందరూ సంయుక్తంగా.......... పెద్దపల్లి గ్రామసేవా..... గ్రామమైన రంగంపల్లి గ్రామం Urban Bridge Boys School &Hostel లో బాలవికాస్ మోటివేషనల్ క్లాస్ తీసుకున్నారు. జిల్లా బాలవికాస్ కో ఆర్డినేటర్ శ్రీమతి జ్యోతి గారు 1. *విద్యార్థులకు మంచి అలవాట్లు , ప్రవర్తన గురించి, 2. ప్రతీ ఆదర్శ గొప్ప వ్యక్తివిజయం వెనుక కఠోర శ్రమ, ప్రయత్నము ఉంటుందని గాంధీజీ, అబ్దుల్ కలాం మొదలగు వారి విద్యార్ధి జీవితము గురించి తెలియజేసి విద్యార్థులతో మాట్లాడించారు. 3. శ్రీ సత్యసాయి బాలవికాస్ ఆవశ్యకత తెలియజేసారు. 4.గురువులు విద్యార్థులను ఆధ్యాత్మిక ఆటలు ఆడించారు. 5. విద్యార్థులతో భజనలు పాడించారు. 6. విద్యార్ధితో దీపారాధన 7. ప్రధానోపాధ్యాయుడితో హారతి ఇప్పించటం జరిగినది. బ్రిడ్జి హాస్టల్ S O శ్రీ సతీష్ గారు మాట్లాడుతూ..... సరియైన కుటుంబ వ్యవస్థ, తల్లితండ్రులు లేనివారు, డ్రా పౌట్స్ విద్యార్థులు ఇక్కడ ఉంటారని కావున ఇట్టి విద్యార్థులకు తప్పకుండా మానవతా విలువల భోధన అవసరమని తెలియజేసారు. తాను చిన్నప్పుడు మా గ్రామములో జరిగే సత్యసాయి భజనలకు వెళ్ళేవాడినని...... ఇప్పుడు ఇలా సాయి సంస్థ మా విద్యార్థులకు మంచి విషయాలు చెప్పటానికి వచ్చినందు కు స్వామి వారికీ ధన్యవాదములు తెలియజేసారు. ఇట్టి కార్యక్రమం 60 మంది బాలురు 6 గురుమహిళలు* బ్రిడ్జి హాస్టల్ సిబ్బింది 6 పాల్గొన్నారు. ఆక్టివ్ గా పాల్గొన్న విద్యార్థు లకు పెన్స్, అందరికి పులిహోర , చాకొలేట్ స్ స్వామి ప్రసాదంగా అందించాము. బాలవికాస్ సెంటర్ గా పురోగమించేలా ఆశీర్వదించి,. వెన్నంటి ఉండి నడిపించమని స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ................ జై సాయిరాం సదా సాయి సేవలో........... శ్రీ సత్యసాయి సేవా సమితి, పెదపల్లి. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు., పెద్దపల్లిజిల్లా. 🙏🙏🙏🙏