Balvikas


ఓం శ్రీ సాయిరాం. స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులతో, ఈరోజు 23.03.2023 వ తేదీనాడు చందనాపూర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్ను, ఎగ్జామ్ సంబంధించిన తదితర వస్తువులు ఈరోజు మధ్యాహ్నం 3.00 గంటలకు ఇవ్వడమైనది. ఈ కార్యక్రమమునకు మన డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటస్వామి గారు పదో తరగతి విద్యార్థులకు మానవతా విలువల గురించి చక్కగా వివరించి, ప్యాడులు, పెన్నులు స్వయముగా ఇవ్వడమైనది. మన సమితి సభ్యులు పురుషులు ఎనిమిది మంది ఈ కార్యక్రమమునకు హాజరైనారు. ఈ కార్యక్రమమునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన అందరికీ స్వామి యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలని స్వామిని మనసారా ప్రార్ధిస్తున్నాను. సదా సాయి సేవలో కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవ సమితి 8వ కాలనీ పెద్దపల్లి జిల్లా