శ్రీ సత్య సాయి భజన మండలి, టేకుమట్ల, భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో తేది: 26.02.2023 న ఉదయం 9.00 గంటల నుండి 12.30 వరకు మెగా పల్లకీ సేవా కార్యక్రమము నిర్వహించి వీధి వీధిన భక్తులకు మహా ప్రసాదం పంపిణీనీ చేసి, మధ్యాహ్నం 1.30 గంటల నుండి దాదాపు 400 మంది భక్తులకి అన్నదానం సేవ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ సభ్యులు, జిల్లా కోఆర్డినేటర్ లు, సమితి కన్వీనర్ లు, భజన మండలి కన్వీనర్ లు, సాయి యూత్ రవితేజ గ్రూప్, మహిళలు, పురుషులు, బాల్ వికాస్ పిల్లలు పాల్గొని విజయవంతం చేశారు. శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామ దర్శిని, పల్లకి సేవ చేయడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు Ch మల్లా రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.