భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల🔹 🔺 ఇద్దరు పేద యువతి ల పెళ్ళిళ్ళకి ఆర్థిక చేయూత కిష్టాపూర్ కి చెందిన "ఒడిపల్లి హేమలత - కీ.శే.లచ్చన్న" ల కూతురు "హారిక" మరియు గోపులాపూర్ కి చెందిన "వేల్పుల కొమురవ్వ - కీ.శే. మల్లేశం" ల కూతురు "పూజ" అనే ఇద్దరు పేద యువతి ల వివాహం నిశ్చయం అయ్యింది. కాని ఇద్దరికీ తండ్రి లేకపోవడం , ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండి ఎటువంటి ఆధారం లేక పోవడం వలన ఆమె బంధువులు మన సత్యసాయి సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో సంస్థ ద్వారా తక్షణమే స్పందించి భక్తుల సహకారంతో అమ్మాయి ల వివాహం నకు కావలసిన ముఖ్య వస్తువులైన *బంగారు మంగళ సూత్రం , వెండి మెట్టెలు, పెళ్లి చీర , మంగళ హారతి సెట్, కన్యాదాన తాంబూలం మరియు చెంబు, స్టీల్ బిందె , ప్లేట్లు , గ్లాసులు , 25kg బియ్యం తదితర వస్తు సామాగ్రిని ఈ రోజు అందచేయడం జరిగింది. అమ్మాయిలు పెళ్లి చేసుకొని ఆ జంటలు సుఖంగా ఉండాలని , వారు పుట్టినింటికి మరియు మెట్టినింటికి మంచి పేరు తేవాలని కలకాలం సుఖంగా జీవించాలని స్వామివారిని ప్రార్థిస్తూ అలాగే సహకరించిన భక్తులందరికీ భగవానుని సంపూర్ణ ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నాం. 🙏 జై సాయిరాం 🙏