Special Programs



శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆధ్వర్యంలో, శ్రీ సత్యసాయి సేవా సమితి భూపాలపల్లి మందిరంలో తేది.23.11.2022 బుధవారం నాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 97వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో అందరికీ ఇదే మా ఆహ్వానం. --: కార్యక్రమ వివరాలు:-- ఉదయం: 5.00 గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన మరియు స్వామి వారి పాదుకాభిషేకం. 9.00 గంటలకు శ్రీ సత్యసాయి పతాకావిష్కరణ ముఖ్య అతిథి శ్రీ బళ్ళారి శ్రీనివాస రావు గారు, జనరల్ మేనేజర్, సింగరేణి కాలరీస్, భూపాలపల్లి ఏరియా మధ్యాహ్నం: 01.00 గంటలకు ,మహా అన్నదాన సేవా ప్రారంభం సాయంత్రం: 06.00 గంటకు ప్రత్యేక భజన కార్యక్రమం, స్వామివారి పుట్టిన రోజు కేకు సమర్పణ, పుట్టిన రోజు పాటలు, ఉయ్యాల సేవ, స్వామి వారి సందేశము, హారతి, విభూతి ప్రసాద వినియోగం తో స్వామి వారి పుట్టిన రోజు వేడుకలు ముగియగలవు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కృపకు పాత్రులు కాగలరని కోరుతూ మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా 🙏జై సాయిరాం🙏