వీధులలో చలికి పడుకున్న నారాయణులకు బ్లాంకెట్స్ పంపిణీ 🔹 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 97వ జయంతిని పురస్కరించుకొని ఈ ఆదివారం (20.11.2022) రోజున రాత్రి 11.00 గంటల నుండి 1.30 వరకు శ్రీ సత్య సాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో "వీధులలో చలికి పడుకున్న నారాయణులకు బ్లాంకెట్స్ పంపిణీ" సేవను నిర్వహించడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరిపై స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం ప్రేమతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల