Nagar Sankirthan





భగవాన్ బాబా వారి 97 వ జయంతి మహోత్సవ కార్యక్రమాలలో మొదటిరోజు సాయి నికేతన్ రెసిడెన్సీ లో ఉదయం 5 గంటలకు ఘనంగా సుప్రభాత సేవ నిర్వహించుకుని సాయంత్రం 6 గంటలకు వేద పఠనం తో ప్రారంభించుకుని భజనతో కొనసాగి,జిల్లా అధ్యక్షుల వారి తొలి ప్రారంభ సందేశం మరియు తెలంగాణ రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక సమన్వయ కర్త శ్రీ రేగళ్ల. అనిల్ కుమార్ గారి ఆధ్యాత్మిక సందేశం తో తొలి రోజు కార్యక్రమం ఘనంగా పూర్తిచేసుకున్నాము.ఈకార్యక్రమమును దగ్గరవుండి ఘనంగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతాభినందనలు తెలియచేసుకుంటు,అక్కడ కార్యక్రమమును నిర్మావహించుట కు సహాయ సహకారములు అందించిన అపార్ట్మెంట్ వాసులందరికి సంస్థ తరపున ధన్యవాదములు తెలియచేస్తున్నాము.జై సాయిరాం కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం.