Workshops & Conferences



ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి అపార కృపా కటాక్షాలతో ఈరోజు స్థానిక బీసీ హాస్టల్ లో విద్యార్థులకు టైం మేనేజ్మెంట్ మరియు హెల్త్ అండ్ హైజానిక్ న్యూట్రిషన్ మొదలగు విషయాల గురించి డాక్టర్ శాంత కుమారి గారు వివరించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా ఆసక్తికరంగా సమాధానాలు ఇస్తూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యువ మహిళా విభాగంలో భాగంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వసతి గృహ ఇన్చార్జ్ ఫాజియా మేడం గారు, డాక్టర్ శాంత కుమారి గారు, జిల్లా మహిళ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీమతి జలజ గారు, జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి శారద గారు, సమితి మహిళా కోఆర్డినేటర్స్ శ్రీమతి సంధ్య గారు, అలాగే ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీమతి లలిత గారు, బాలవికాసి ఇంచార్జ్ శ్రీమతి సరిత గారు, సమితి యువ మహిళా విభాగం పాల్గొనడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో దాదాపు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారందరికీ *స్వామి వారి ఫోటో , విభూతి, ప్రసాదం అందించడం జరిగినది. యువజన విభాగం నుండి పదిమంది సేవాదళ్, మహిళా విభాగం నుండి 06 గురు సేవాదళ్ పాల్గొన్నారు.... సాయిరాం🙏 కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి జడ్చర్ల