Balvikas






ఓం శ్రీ సాయిరాం 🙏 భగవానుని దివ్యపాద పద్మాలకు ప్రణమిల్లుతూ.......అందరికి సాయిరాం స్వామి వారి దివ్యాశిశులతో....నిన్న తేదీ 4/9/2022 , ఆదివారం రోజు శ్రీ సత్య సాయి సేవా సమితి, పెద్దపల్లి లో 4 జిల్లాల పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల , మంచిర్యాల జిల్లా బాలవికాస్ గురువులకు గ్రూప్ 2 శిక్షణా తరగతులు నిర్వహించుకున్నాము. 1.బాలవికాస్ విద్యార్థుల, గురువులు వేదపఠనం చేశారు. 2. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ బి వెంకటస్వామి గారు బాలవికాస్ గురువులకు స్ఫూర్తినిస్తూ మాట్లాడారు. 2. రాష్ట్రవిద్యా విభాగపు కో ఆర్డినేటర్ శ్రీ హరినాథ్ గారు , స్టేట్ బాలవికాస్ ప్యాకెలిటీ శ్రీమతి నీరజ గారు , శ్రీమతి శ్రీలక్ష్మి గారు , జిల్లా కో ఆర్డినేటర్స్ శ్రీ గణేష్ గారు, శ్రీ రత్నాకర్ గారు , శ్రీమతి జ్యోతి గారు బాలవికాస్ గ్రూప్ 2 లోని పలు అంశాలతో బోధనా శిక్షణా తరగతుల్లో చాలా చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందించారు. 4. 4 జిల్లాల DEC లు, సమితి బాలవికాస్ కో ఆర్డినేటర్స్, గురువులు , పెద్దపల్లి జిల్లా వివిధ విభాగాల కో ఆర్డినేటర్స్, సమితి కన్వీనర్లు , సమితి బాలవికాస్ కో ఆర్డినేటర్స్, గురువులు , ఆక్టివ్ సేవాదళ్ , గ్రూప్ 2 బాలవికాస్ చిన్నారులు మొత్తం 130 మంది పాల్గొన్నారు. 5. బాలవికాస్ చిన్నారులు చేసిన పుష్పగుచ్ఛాలు, గ్రీటింగ్ కార్డ్స్, క్రాఫ్ట్ వర్క్ పిక్చర్స్ స్టేట్ మరియు జిల్లా , సమితి విద్యా విభాగపు కో ఆర్డినేటర్ లకు అందించారు. ఇట్టి శిక్షణా తరగతులు తీవ్రమైన వర్షములోకూడా చక్కగా నిర్వహించుకునేట్లు ఆశీర్వదించిన స్వామి వారికి మరోసారి ప్రణమిల్లుతూ.........పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామి వారు నిండుగా దండిగా మెండుగా ఆశీర్వదించాలని , మనఃస్ఫూర్తి గా కోరుకుంటూ.......... జై సాయిరాం సదా సాయి సేవలో...... శ్రీ సత్యసాయి బాలవికాస్ విభాగం, పెద్దపల్లి జిల్లా. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , పెద్దపల్లి జిల్లా. 🙏🙏🙏🙏🙏🙏